Gangubai Kathiawadi OTT Release: నెట్‌ప్లిక్స్‌లో 'గంగూబాయి కతియావాడి'.. ఎప్పుడంటే

Alia Bhatt Gangubai Kathiawadi Streaming On Netflix From March 25th - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ గంగూబాయి కతియావాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్‌  లీలా భన్సాలీ ముఖ దర్శకుడు సంజయ్‌  లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆలియా గంగూబాయి పాత్రను పోషించింది.

తన అందం, అభినయం, డైలాగ్‌ డెలీవరీతో ఆలియా విమర్శకుల ప్రశంసలు పొందింది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఇందుకోసం మేకర్స్‌తో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. మార్చి 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఈ సినిమాలో  బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top