స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడనున్న బుట్ట బొమ్మ..!! | Rumors About Actress Pooja Hegde Will Marriage With Famous Cricketer; News Viral - Sakshi
Sakshi News home page

Pooja Hegde: క్రికెటర్‌తో పూజా హెగ్డే పెళ్లి.. ఆ విషయంపై ఆరా తీస్తున్న ఫ్యాన్స్!

Published Sun, Sep 24 2023 6:37 PM

Actress Pooja Hegde Knot With Famous Cricketer Goes Viral - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య జంటగా ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇ‍చ్చిన భామ పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ తర్వాత దువ్వాజ జగన్నాధం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, ‍అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్‌ సరసన నటించిన కిసీ కా భాయ్... కిసీ కీ జాన్ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. మహేశ్ బాబు సరసన గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చినా.. అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. 

(ఇది చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!)

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని బీటౌన్ టాక్. త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ ప్రముఖ క్రికెటర్‌తో ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇంతకీ బుట్టబొమ్మను చేసుకోబోయే ఆ స్టార్ క్రికెటర్ ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. 

అయితే ఈ విషయంపై పూజా హేగ్డే ఇంతవరకు స్పందించలేదు. ఇటీవలే ముంబయిలోని సేవా మండల్‌ను సందర్శించిన ఆమె గణేశున్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుని పూజలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి గణపతికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం బుట్టబొమ్మ స్పందించాల్సిందే. 

(ఇది చదవండి: స్టార్‌ హీరోయిన్‌కు రజినీకాంత్‌ వార్నింగ్.. ఆమె కోసమేనా?)

Advertisement
 
Advertisement
 
Advertisement