'కాంటా లగా' సాంగ్‌తో సెన్సేషన్‌.. నటి కన్నుమూత | Kaanta Laga Fame Actress Shefali Jariwala Passed Away Due To Cardiac Arrest, Know More Details | Sakshi
Sakshi News home page

'కాంటా లగా' సాంగ్‌తో సెన్సేషన్‌.. నటి కన్నుమూత

Jun 28 2025 8:14 AM | Updated on Jun 28 2025 1:38 PM

Actress, Kaanta Laga Fame Shefali Jariwala Passed Away

బాలీవుడ్‌ నటి, కాంటా లగా సాంగ్‌ ఫేమ్‌ షెఫాలీ జరివాలా (42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్‌ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్‌ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్‌ ఆస్పత్రికి తరలించారు.  తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నటి మృతికి ఇంకా కారణాలు తెలియలేదన్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఆమె నివాసంలో పలు ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. షెఫాలి (Shefali Jariwala) మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

నటి ప్రయాణం సాగిందిలా..
షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్‌ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్‌ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్‌ చేశారు. బేబీ కమ్‌నా అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించారు. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్‌ సింగ్‌ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్‌ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: ఆస్కార్‌ కమిటీలో ఇండియన్‌ స్టార్స్‌

Advertisement
 
Advertisement
Advertisement