అవును.. ఆమెతో డేటింగ్‌లో ఉన్నా: అమిర్ ఖాన్‌ షాకింగ్ కామెంట్స్ | Aamir Khan Confirms Relationship With His Longtime Friend Gauri Spratt, Know About Her | Sakshi
Sakshi News home page

Aamir Khan Dating: ఆమెతో ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నా

Published Thu, Mar 13 2025 9:04 PM | Last Updated on Fri, Mar 14 2025 9:10 AM

Aamir Khan Confirms Releation with His Friend Gauri Spratt

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తన స్నేహితురాలితో డేటింగ్‌లో ఉన్నమాట వాస్తవమేనని వెల్లడించారు. ముంబయిలో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల ముందు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నట్లు  తెలిపారు. తాను దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుసని అమిర్ స్పష్టం చేశారు.

గౌరీ స్ప్రాట్‌ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు అమిర్ ఖాన్ వెల్లడించారు. అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్‌లో పనిచేస్తోందని వివరించారు. ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారని వివరించారు. ఆమె తన కుటుంబ సభ్యులను కూడా కలిసిందని.. మా రిలేషన్‌ గురించి వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆమెతో రిలేషన్‌లో తాను నిబద్ధతతో, సంతోషంగా ఉన్నానని అమిర్ ఖాన్ పేర్కొన్నారు.  'లగాన్', 'దంగల్' లాంటి  కొన్ని చిత్రాలను మాత్రమే గౌరీ స్ప్రాట్ చూశారని అన్నారు. తనకు 'సూపర్ స్టార్' అనే లేబుల్‌ను ఉండడాన్ని తాను నమ్మడం లేదని  చెప్పినట్లు ఈ సందర్భంగా అమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు.

తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లను పుట్టినరోజు విందుకు ఆహ్వానించినట్లు అమిర్ ఖాన్ తెలిపారు. ఈ డిన్నర్ పార్టీకి గౌరీ స్ప్రాట్ వచ్చిందని వెల్లడించారు. ఆమె సగం తమిళియన్ కాగా.. మరో సగం ఐరిష్ మహిళ అని అన్నారు. ఆమె తాత స్వాతంత్ర్య సమరయోధుడని అమిర్ పేర్కొన్నారు.

కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందే చిత్ర నిర్మాత కిరణ్ రావును పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ దంపతులకు ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. మొదట మన సూపర్ స్టార్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా ఖాన్,  జునైద్ ఖాన్ ‍అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెతో 2002లో విడిపోయారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement