భూమి ఉన్నంత వరకే రాజు | 111 Green Zone Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

భూమి ఉన్నంత వరకే రాజు

Sep 3 2023 4:43 AM | Updated on Sep 3 2023 4:43 AM

111 Green Zone Movie Teaser Launch - Sakshi

‘సూడుండయ్యా... రైతు భూమి ఉన్నంతవరకే రాజు. ఒక్కసారి ఆ భూమి అమ్ముకున్నామా.. అదే భూమికి కూలీలమైపోతాం’ అనే డైలాగ్‌తో విడుదలైంది ‘‘111 గ్రీన్‌ జోన్‌’ సినిమా కాన్సెప్ట్‌ టీజర్‌. సినిమా బండి క్రియేషన్స్, యుపిక్‌ క్రియేషన్స్‌ పతాకాలపై విజయ రాఘవేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

శనివారం ఈ సినిమా కాన్సెప్ట్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ రాఘవేంద్ర మాట్లాడుతూ– ‘‘మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘111 గ్రీన్‌జోన్‌’. మంచి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కంటెంట్‌ పరంగా ‘111 గ్రీజ్‌ జోన్‌’ మూవీ చాలా ప్రత్యేకమైనది. మన సంస్కృతితో ముడిపడిన చిత్రం ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు లియాండర్‌ లీ. ఈ కార్యక్రమంలో వీఎఫ్‌ఎక్స్‌ చంద్ర, లిరిక్‌ రైటర్‌ చిత్రన్‌ మాట్లాడారు.
∙విజయ రాఘవేంద్ర, ఉదయ్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement