ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ వసతులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ వసతులు

Published Sun, Oct 1 2023 4:12 AM | Last Updated on Sun, Oct 1 2023 4:12 AM

పనులను ప్రారంభిస్తున్న అధికారులు - Sakshi

తూప్రాన్‌: ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా సమగ్ర శిక్షా సెక్టోరియల్‌ అధికారి జ్యోతి అన్నారు. మన ఊరు– మనబడి కింద మండలంలోని కిష్టాపూర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, హ్యాండ్‌ వాష్‌, ముత్రశాలలు, వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చానాయక్‌, హెచ్‌ఎం లక్ష్మణ్‌, ఎంపీడీఓ అరుంధతి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం శ్రీనివాస్‌, సర్పంచ్‌ పోచయ్య, ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ శ్రీశైలం, ఉప సర్పంచ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఏఈ మధు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement