మళ్లీ మనదే అధికారం | Sakshi
Sakshi News home page

మళ్లీ మనదే అధికారం

Published Sat, Nov 25 2023 1:24 AM

- - Sakshi

శనివారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం

రోడ్‌ షోను

విజయవంతం చేయండి

మంత్రి సత్యవతిరాథోడ్‌

గూడూరు: మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ గెలుపుకోసం శనివారం గూడూరు మండల కేంద్రంలో జరిగే ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రోడ్‌ షోను విజయవంతం చేయాలని మంత్రి సత్యవతిరాథోడ్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎన్నో మాటలు చెబుతున్నారని, అవి నమ్మొద్దన్నారు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా శంకర్‌నాయక్‌ మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. హరీశ్‌రావు రోడ్‌షోకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్‌ కవిత, బీఆర్‌ఎస్‌ మానుకోట ఎన్నికల ఇన్‌చార్జ్‌ నూకల నరేష్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, నాయకులు భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మోదీ సభకు

భారీగా తరలిరావాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని తాళ్లపూసపల్లి రోడ్డు లోటస్‌ మైదానంలో ఈ నెల 27న నిర్వహించే ప్రధాని మోదీ సకల జనుల విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్‌యక్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 27న నిర్వహించే బహిరంగ సభకు మహిళలు, యువత, కార్యకర్తలు భారీ గా తరలిరావాలని కోరారు. 1.5లక్షల జనసమీకరణే లక్ష్యం అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మహారాష్ట్రలోని సంగిలి ఎమ్మెల్యే గాడ్గిల్‌, బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిశోర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమురయ్య, శశివర్ధన్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ సిద్ధార్థ రెడ్డి తదితరులు ఉన్నారు.

మార్కెట్‌కు సెలవులు

మహబూబాబాద్‌ రూరల్‌: మానుకోట వ్యవసాయ మార్కెట్‌కు నేటి(శనివారం)నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు 10రోజుల పాటు సెలవులు ప్రకటించనిట్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విద్యాసాగర్‌ శుక్రవారం తెలిపారు. రైతులు, వ్యాపారస్తులు, గుమస్తాలు, దడువాయిలు, హమాలీలు, కూలీలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి డిసెంబర్‌ 4వ తేదీన మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు.

రూ.5లక్షలు స్వాధీనం

మహబూబాబాద్‌ రూరల్‌: మానుకోట మండలంలోని అయోధ్యగ్రామ క్రాస్‌రోడ్డు వద్ద రూ.5లక్షలు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు ఎఫ్‌ఎస్టీ టీం లీడర్‌ సుగుణాకర్‌ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కేసముద్రం మండలం ధన్నసిరి గ్రామానికి చెందిన సిరికొండ శ్రీకాంత్‌ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంలో రూ.5లక్షలు తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు. అతడి వద్ద డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు సుగుణాకర్‌ తెలిపారు.

మరమ్మతు చేపట్టాలి

గార్ల: గార్ల రైల్వేస్టేషన్‌ ఎగువ లైన్‌లో ప్రమాదకరంగా మారిన ప్లాట్‌ఫారంనకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని రైల్వే ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎగువ లైన్‌లో ఉన్న ప్లాట్‌ఫారం టైల్స్‌ ఊడిపోయాయని, రాత్రి సమయంలో రైలు దిగుతున్న సమయంలో టైల్స్‌ తగిలి కిందపడిపోయే ప్రవమాదం ఉందన్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులు గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌/ భూపాలపల్లి/ములుగు: తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారమని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిందని, ఎన్నికల సమయంలో అబద్ధ్దాలు, హామీలతో వస్తున్న ఆ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ హయాంలో గిరిజన ప్రాంతాలు ఎన్‌కౌంటర్లకు నిలయాలుగా మారాయని, ఎమర్జెన్సీ, జైలు పాలు చేసే బానిస బతుకుల విముక్తి కోసం బడే నాగజ్యోతి తల్లిదండ్రులు అడవి బాట పట్టి అసువులు బాశారన్నారు. తెలంగాణ ఏర్పాటు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు మార్గదర్శకాలతో సమస్యలను నిర్మూలించగలిగామన్నారు. ప్రజలను ఆగం చేసే కాంగ్రెస్‌లాంటి పార్టీ మనకొద్దని, కర్ణాటకలో గెలిపించినందుకు అక్కడి ప్రజలు బాధపడుతున్నరని గుర్తు చేశారు.

నాగజ్యోతి గెలిస్తే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది

‘ములుగులో కొన్ని పనులు కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా నువ్వు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు గాక. తప్పకుండా సీఎంను కలవాలి. గవర్నమెంట్‌లో ఉన్నవాళ్లను కలవాలి, మాట్లాడాలి. మీ ము లుగు ఎమ్మెల్యే ఎన్నడూ రాదు. ఏం అడగదు. మాకు తోచినవి.. తెలిసినవి.. మా పార్టీవాళ్లు చెప్పిన పనులు చేసుడే తప్ప ఆమె వచ్చి ఎన్నడూ అడగదు. ఏం చేసిర్రు మీరు అంటే.. ఏం చేయలేదు? బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది’ అని కేసీఆర్‌ అన్నారు.

ములుగు, భూపాలపల్లి అభివృద్ధి నా బాధ్యత

ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతను తానే తీసుకుంటానన్న సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బడే నాగజ్యోతి, గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించాలని కోరారు. బడే నాగజ్యోతి కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలిగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హోదాకు వచ్చింది. నాగజ్యోతిని గెలిపించాలి’ అని కోరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నియోజకవర్గం కోసం బాగా కష్టపడుతున్నారన్నారు. తన దగ్గరకు వచ్చిన ప్రతీసారి అభివృద్ధి పనులకు నిధులు అడిగాడే తప్ప సొంత పనులు ఎప్పుడే అడగలేదన్నారు.

సింగరేణిని ఆగం చేసింది కాంగ్రెస్సే..

‘సింగరేణి సంస్థను ఆగం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే. సంస్థ అప్పులు కట్టలేక 49 శాతం వాటాను కేంద్రానికి అప్పగించింది. డిపెండెంట్‌ ఉద్యోగాలు కూడా వద్దని సంతకం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని’ సీఎం కేసీఆర్‌ అన్నారు. వర్షం కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ, ప్రజలు ఇంత భారీ ఎత్తున తరలి రావడం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి సంకేతమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పైరవీలు, దళారీ వ్యవస్థ విపరీతంగా పెరుగుతుందన్నారు. ఆయా సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, బీఆర్‌ఎస్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సతీశ్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్‌, వీరమల్ల ప్రకాశ్‌, వాసుదేవరెడ్డి, పోరిక గోవింద్‌నాయక్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా: గండ్ర

సీఎం కేసీఆర్‌ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ పునాదులు వేశాడన్నారు. చిన్న గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన మహనీయుడు కేసీఆర్‌ అని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు నమ్మవద్దని కోరారు.

రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేసింది? : నాగజ్యోతి

‘నాకు అయ్యవ్వలు లేరు. నాకంటూ కుటుంబం లేదు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం, నన్ను సాదుకుంటారో.. చంపుకుంటారో మీ ఇష్టం’ అని ములుగు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ములుగుకు మెడికల్‌ కాలేజీ, మున్సిపాలిటీ, మల్లంపల్లి మండలంగా ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు.

న్యూస్‌రీల్‌

ములుగు, భూపాలపల్లిలో బీఆర్‌ఎస్‌ గెలవాలి

ప్రజలను ఆగం చేసిన పార్టీలు మనకొద్దు..

కర్ణాటక ప్రజలు బాధపడ్తున్నరు

సింగరేణిని ఆగం చేసింది కాంగ్రెస్సే

ఆ పార్టీ అధికారంలోకొస్తే పైరవీలు, దళారీ వ్యవస్థ

ములుగు, భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద

సభల్లో సీఎం కేసీఆర్‌

కేసీఆర్‌ పర్యటన సాగిందిలా..

సాయంత్రం 3.42 గంటలకు : ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

3.50 గంటలకు : స్టేడియంలోని సభ ప్రాంగణానికి రాక

4.02 గంటలకు : సీఎం కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభం

4.26 గంటలకు : ప్రసంగం ముగింపు

4.32 గంటలకు : హెలికాప్టర్‌లో భూపాలపల్లికి పయనం

4.45గంటలకు : భూపాలపల్లిలో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

4.55గంటలకు: సభ ప్రాంగణానికి రాక

5.05 – 5.12 గంటల వరకు: ప్రసంగం

5.15 గంటలకు : హైదరాబాద్‌కు పయనం

1/9

2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9

 
Advertisement
 
Advertisement