మంచి పాలనకే ‘తొలి’ ఓటు! | Sakshi
Sakshi News home page

మంచి పాలనకే ‘తొలి’ ఓటు!

Published Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

● నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాం ● ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగం ● పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది ● తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత మనోగతం

కర్నూలు(అగ్రికల్చర్‌): మంచి పాలన అందించే వారికే తాము ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులు చెబుతున్నారు. పాలకులు మంచి వారైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి వారినే తాము ఎన్నుకుంటామని పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో 20.14 లక్షలు, నంద్యాల జిల్లాలో 13.94 లక్షలు.. మొత్తం 34.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్ల యువత 1,71,215 మంది ఉన్నారు. అయితే ఇందులో 87,285 మంది ఓటర్లుగా నమోదయ్యారు. మే నెల 13న నిర్వహించే శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 49,741, నంద్యాల జిల్లాలో 37,844 మంది మొద టి సారిగా ఓటు వేయనున్నారు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వారిని, అభివృద్ధి చేసేవారని గెలిపిస్తామని చెబుతున్నారు.

ఈ సారి పెరగనున్న ఓటింగ్‌ శాతం..

18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచే విధంగా ఎన్నికల కమిషన్‌ పిలుపు నిస్తోంది. ఇందులో భాగంగా స్వీప్‌ కార్యక్రమాలను అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. 2019 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్‌కు 50 శాతం వరకు యువత దూరంగా ఉంటోంది. ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్‌ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నియోజకవర్గాల వారీగా యువఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

నియోజక వర్గం 18–19 ఏళ్ల

యువ ఓటర్లు

కర్నూలు 6,425

పాణ్యం 8,250

పత్తికొండ 5,678

కోడుమూరు 5,947

ఎమ్మిగనూరు 6,483

మంత్రాలయం 5,429

ఆలూరు 5,749

శ్రీశైలం 8,349

నంద్యాల 6,709

బనగానపల్లె 6,402

ఆదోని 5,510

ఆళ్లగడ్డ 5,247

డోన్‌ 5,488

నందికొట్కూరు 5,609

మొత్తం 87,275

Advertisement
Advertisement