నిఘా మరింత పెంచాలి | Sakshi
Sakshi News home page

నిఘా మరింత పెంచాలి

Published Tue, Apr 23 2024 8:10 AM

సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ ఎస్పీ నాగరాజు, హాజరైన సెబ్‌ అధికారులు - Sakshi

మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి

అడిషనల్‌ ఎస్పీ నాగరాజు

కర్నూలు: మద్యం, నగదు, కానుకల అక్రమ రవాణాను అరికట్టేందుకు సెబ్‌, ఎకై ్సజ్‌, ఎన్నికల టాస్క్‌ఫోర్స్‌ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని అడిషనల్‌ ఎస్పీ నాగరాజు ఆదేశించారు. చెక్‌పోస్టుల్లో నిఘా మరింత పెంచాలన్నారు. సెబ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌ బాబుతో పాటు జిల్లాలోని 7 సెబ్‌ స్టేషన్లు, 7 ఎకై ్సజ్‌ చెక్‌పోస్టులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, మోడల్‌ కండక్ట్‌ టీమ్‌ అధికారులతో సమన్వయ సమావేశం సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. మద్యం, సారా అక్రమ రవాణాలో ఆరు నెలల్లోపు వరుసగా మూడుసార్లు పట్టుబడి కేసులు నమోదైనవారి జాబితాను తయారు చేసి ఎస్పీ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని ఏఎస్పీ సెబ్‌ అధికారులకు సూచించారు. జిల్లా బహిష్కరణకు 26 మంది జాబితాను సిద్ధం చేసినట్లు సెబ్‌ అధికారులు వెల్లడించారు. అలాగే పీడీ చట్టం నమోదుకు ఒకరి పేరు ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి, బార్ల నుంచి ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేసినట్లయితే అలాంటి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వారిపై నిఘా పెంచాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడిన సేల్స్‌ మెన్‌లు, సూపర్‌వైజర్లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. అలాగే సారా బెల్లం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీఐలు వాసుదేవ చౌదరి, చంద్రహాస్‌, రాజేంద్రప్రసాద్‌, డీటీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసనాయుడు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement