అట్టహాసంగా నామినేషన్లు | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా నామినేషన్లు

Published Tue, Apr 23 2024 8:10 AM

కాటసాని నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రజలు - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో నాలుగోరోజు సోమవారం 34 మంది అభ్యర్థులు 38 నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులుగా పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆదోని నుంచి వై.సాయిప్రసాద్‌రెడ్డి అట్టహాసంగా నామినేషన్లను దాఖలుచేశారు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు బుట్టారేణుక, కంగాటి శ్రీదేవి, వై.బాలనాగిరెడ్డి తరఫున అదనపు సెట్ల నామినేషన్లను ప్రతిపాదులు అందించారు.

● కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఐదు మంది ఏడు నామినేషన్లను ఆర్వోలకు అందించారు. కాంగ్రెస్‌ నుంచి జి.రాంపులయ్య యాదవ్‌, టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుగా, బి.నాగరాజుగా మరో రెండుసెట్ల నామినేషన్లను వేశారు. వడ్డే ఉరుకుంద అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లను వేశారు. తరగోపుల రాజాబాబు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ తరపున షేక్‌ నజీర్‌ అహ్మద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

● కర్నూలు నుంచి ఆరుగురు నామినేషన్లను వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సంధ్యపోగు రాఘవేంద్ర, ఎస్‌.నౌషద్‌, ఏపీ రామయ్య యాదవ్‌, హుసేనపీరా సాహెబ్‌,షేక్‌ ఇంతియాజ్‌ బాషా, బీకే నాగరాజు నామినేషన్లను దాఖలు చేశారు.

● పాణ్యంనుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థిగా డి.గౌస్‌దేశాయ్‌, జలదుర్గం సీతమ్మ నామినేషన్లను అందించారు.

● ఎమ్మిగనూరు నుంచి మొత్తం నలుగురు ఆరు సెట్ల నామినేషన్లను వేశారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున బుట్టారేణుక మూడు సెట్లు, టీడీపీ అభ్యర్థి బీ.జయనాగేశ్వరరెడ్డి, అతని భార్య బైరెడ్డి నిత్యాదేవీ ఒక్కో సెట్‌ నామినేషన్‌ వేశారు. బీఎస్పీ నుంచి కె.రాఘవేంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు.

● మంత్రాలయం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా వై.బాలనాగిరెడ్డి ఒక నామినేషన్‌, టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి తరపున ఒక నామినేషన్‌ వేశారు.

● ఆదోని నియోజకవర్గం నుంచి వై.సాయిప్రసాద్‌రెడ్డి ఒక్కరే ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు.

● ఆలూరు టీడీపీ అభ్యర్థి బి.వీరభద్రగౌడ్‌, ఆయన కుమారుడు బి.గిరిమల్లేష్‌ గౌడ్‌ ఒక్కో సెట్‌ నామినేషన్లను దాఖలు చేశారు.

4వ రోజు 34 మంది అభ్యర్థులు

38 నామినేషన్ల దాఖలు

సాయిప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం
1/4

సాయిప్రసాద్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం

2/4

3/4

మంత్రాలయంలో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
4/4

మంత్రాలయంలో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

Advertisement
Advertisement