Sakshi News home page

మే 25 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Published Tue, Apr 16 2024 1:40 AM

-

నంద్యాల(న్యూటౌన్‌): మే 25 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సునీత సోమవారం తెలిపారు. ఫీజు చెల్లింపునకు ఈనెల 18 నుంచి 24వ తేదీ వ రకు గడువు ఉందన్నారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఇదే తేదీలో ఫీజు చెల్లించాలని తెలిపారు. జవాబు పత్రాల ఒక్కొక్క పేపర్‌ రీ వెరిఫికేషన్‌కు రూ.1,300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూమెంట్‌ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలన్నారు. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూట్‌మెంట్‌ రాయాలనుకునే సైన్స్‌ విద్యార్థులు రూ.1,440, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1,240 చొప్పున చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో విద్యార్థులు సంప్రదించాలని డీవీఈఓ తెలిపారు.

Advertisement
Advertisement