రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన | Sakshi
Sakshi News home page

రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన

Published Sun, Nov 19 2023 12:16 AM

-

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం వైభవంగా సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement
Advertisement