వరల్డ్‌కప్‌ మనదే..

- - Sakshi

భారత్‌ ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అప్రతిహతమైన విజయాన్ని అందుకుంది. ఇదేరీతిలో ఫైనల్స్‌లోనూ సత్తాచాటి కప్‌ అందుకునేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అందరూ ప్రతిభ కనబరుస్తున్నారు. అందుకే మనం కప్‌ సాధించడం ఖాయం.

– డాక్టర్‌ బి.వెంకన్న, సీనియర్‌ పీడీ

మిడిల్‌ ఆర్డర్‌పైనే ఆశలు

మిడిల్‌ ఆర్డర్‌లో కోహ్లి బ్యాట్స్‌మెన్‌గా వస్తే సెంచరీ సాధించడం ఖాయం. ఆస్ట్రేలియాను ఓడించి కప్‌ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను మన బౌలర్లు నిలువరించే అవకాశముంది. కనీసం 50 పరుగుల తేడాతో కప్‌ సాధిస్తుందనే ఆశిస్తున్నాను. – ఎం.డీ.ఫారుఖ్‌, సీనియర్‌ క్రికెటర్‌

ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నారు..

మన జట్టులో అందరూ ఫీల్డింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఫైనల్‌లో ప్రత్యర్థుల బాల్స్‌ను ఆపగలిగితే విజయం మనదే అవుతుంది. మ్యాచ్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాం. ఆదివారం పనులన్నీ వాయిదా వేసుకుని మ్యాచ్‌ చూడాలని కుటుంబమంతా నిర్ణయించుకున్నాం.

– ఏనిసెట్టి శ్రీనివాసరావు, ప్రైవేట్‌ అధ్యాపకుడు

గతంలో ఎన్నడూ చూడని జట్టు

నేను 40 ఏళ్లుగా క్రికెట్‌ చూస్తున్నా. కానీ ఇప్పటి మాదిరి జట్టు ఎప్పుడూ లేదు. జట్టులోని ప్రతీ ఆటగాడు రాణిస్తుండడం శుభపరిణామం. బ్యాటింగ్‌, బౌలింగ్‌ల్లో ఏది ఎంచుకున్నా వంద శాతం సత్తా చాటుతున్నారు. మన జట్టుకు ప్రపంచ కప్‌ గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయి. – ఊటుకూరు సూర్యనారాయణ, ఎల్‌ఐసీ ఏజెంట్‌

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top