Telangana: Nagaraju Told Him To Go Away And Not Smoke - Sakshi
Sakshi News home page

సిగరెట్‌ తాగొద్దన్నందుకు దాడి!

Jul 24 2023 12:12 AM | Updated on Jul 24 2023 2:26 PM

- - Sakshi

ఖమ్మం: సిగరెట్‌ తాగుతున్న యువకులను దూరంగా పోయి తాగాలని చెప్పినందుకు వారు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం సాయంత్రం ధంసలాపురానికి చెందిన ఎన్‌.వెంకటమ్మ ఇంటి ఎదురుగా నలుగురు యువకులు సిగరెట్‌ తాగుతూ వదులుతున్న పొగ ఇంట్లోకి వస్తోంది.

గమనించిన వెంకటమ్మ, కుమారుడు నాగరాజు.. దూరంగా వెళ్లి తాగండని చెప్పారు. దీంతో చంటి అనే యువకుడితో పాటు మిత్రులు మరో ముగ్గురు కలిసి వారిని అసభ్యకరంగా దూషిస్తూ రాళ్లతో దాడి చేశారని, పోలీసులకు చెపితే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement