Sakshi News home page

శిశు మరణాలను నివారించాలి

Published Fri, Nov 17 2023 1:06 AM

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న
డాక్టర్‌ జంబయ్య తదితరులు   - Sakshi

హొసపేటె: జిల్లాలో అతిసార, విరోచనాలను అరికట్టి శిశువుల మరణాలను నివారించాలని డీహెచ్‌ఓ శంకర్‌ నాయక్‌ సూచించారు. ఆయన గురువారం నగరంలోని మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఆసుపత్రిలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అతిసార, బేధుల కారణంగా ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చనిపోతున్నారన్నారు. పిల్లల మరణాల రేటును తగ్గించడానికి చర్య తీసుకోవాలన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 15 నుంచి 28 వరకు జరిగే కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పిల్లలకు ఓఆర్‌ఎస్‌, జింక్‌ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. ఓఆర్‌ఎస్‌, జింక్‌ వాడకం, రక్షిత మంచినీటి వినియోగం, మరుగుదొడ్ల వాడకం, చేతులు కడుక్కోవడం గురించి ప్రజల్లో అవగాహన తేవాలన్నారు. జిల్లా ఆర్‌సీహెచ్‌ అధికారి డాక్టర్‌ జంబయ్య, జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్‌ జగదీష్‌ పట్నే, జిల్లా ఆరోగ్య విద్యా అధికారి ఎంపీ దొడ్డమని, సర్జన్‌ డాక్టర్‌ సలీం, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్‌ భాస్కర్‌, వైద్యాధికారులు డాక్టర్‌ ఉషా, డాక్టర్‌ చంద్రమోహన్‌, డాక్టర్‌ నూర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement