త్రుటిలో తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Tue, Apr 23 2024 8:15 AM

రైల్వే స్టేషన్‌ ఎదుట బోల్తా పడిన లారీ 
 - Sakshi

డిచ్‌పల్లి: ధాన్యం బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ ఎదుట సోమవారం సాయంత్రం బోల్తాపడింది. ఓవర్‌ లోడ్‌ కారణంగా లారీ ఎడవవైపు ఒరిగి బోల్తాపడింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిపై ధాన్యం బస్తాలు పడకపోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌ అద్దాన్ని పగులగొట్టుకుని క్యాబిన్‌లో నుంచి బయటకు వచ్చాడు. సిరికొండ మండలం చీమన్‌పల్లిలో ఐడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాలను లోడ్‌ చేసుకుని నిజామాబాద్‌ శివారులోని రైస్‌మిల్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న పోలీసులు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించారు. ఐడీసీఎంఎస్‌ సిబ్బందితో మాట్లాడి మరో లారీని రప్పించి ధాన్యం బస్తాలను తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement