TS Kamareddy Assembly Constituency: TS Election 2023: షబ్బీర్‌ అలీకి లైన్‌క్లియర్‌..! ఎల్లారెడ్డి నుంచి ఇద్దరి పేర్ల పరిశీలన..!
Sakshi News home page

TS Election 2023: షబ్బీర్‌ అలీకి లైన్‌క్లియర్‌..! ఎల్లారెడ్డి నుంచి ఇద్దరి పేర్ల పరిశీలన..!

Sep 4 2023 1:04 AM | Updated on Sep 4 2023 2:31 PM

- - Sakshi

కామారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ నాయకత్వం దరఖాస్తులను వడపోసి, ఒక్కో నియోజకవర్గంనుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లతో జాబితాను రూపొందించింది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఎల్లారెడ్డి నుంచి నలుగురు దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించిన పీసీసీ ఎన్నికల కమిటీ.. పీసీసీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావుల పేర్లను సిఫారసు చేసింది.

జుక్కల్‌ నుంచి ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ముగ్గురి పేర్లను ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌తో పాటు తోట లక్ష్మీకాంత్‌రావ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గం టికెట్టు కోసం 16 మంది దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు పేరుతో పాటు మరో ఇద్దరి పేర్లను ఎంపిక చేశారు. వారి వివరాలు తెలియరాలేదు. ఈ జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించిన అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement