ఈ ఇలలో.. గోదారి ప్రతి అలలో.. నీ జ్ఞాపకాలే..

- - Sakshi

బాల నటుడి సరసన అమలాపురానికి చెందిన ప్రస్తుత ఎస్‌కేబీఆర్‌ కళాశాల తెలుగు విభాగాధిపతి, కవి డాక్టర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరితో పాటు అమలాపురానికి చెందిన కొందరు పెద్దలు కూడా ఈ సన్నివేశాల్లో కనిపిస్తారు. పెళ్లిచూపులు, మూడుముళ్లు చిత్రాలు అదే సంవత్సరం విడుదలై మంచి హిట్‌ అయ్యాయి.

● రామాలయం సినిమా షూటింగ్‌ సందర్భంగా అల్లు రామలింగయ్యతో కలిసి చంద్రమోహన్‌ తొలిసారిగా 1973లో కొత్తపేటలోని గాలిదేవర రామకృష్ణారావు ఇంటికి వచ్చారు.

● రాజేంద్రప్రసాద్‌, చంద్రమోహన్‌ హీరోలుగా చిన్నోడు – పెద్దోడు సినిమా చిత్రీకరణ కూడా కొత్తపేట పరిసరాల్లోనే జరిగింది. ఒక పాటలో కొంత భాగాన్ని వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు ఇటుక బట్టీ వద్ద తీశారు. చంద్రమోహన్‌ నటించిన ప్రణయగీతం సినిమా షూటింగ్‌ కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. ఆత్రేయపురానికి చెందిన కళావాణి సంస్థ అధ్యక్షుడు సఖినేటి రామకృష్ణంరాజుకు చంద్రమోహన్‌ పరిచయం ఉంది. దీంతో ఆయనతో కలిసి పలు చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు.

● చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బాపు బొమ్మకు పెళ్లంట చిత్రాన్ని మందపల్లి, వెదిరేశ్వరం, ఆత్రేయపురం ప్రాంతాల్లో చిత్రీకరించారు. పాటలు, పలు సన్నివేశాలు మినహా 60 శాతం సినిమాను మందపల్లిలోని సీనియర్‌ పాత్రికేయుడు చింతం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ చింతం విజయ కృష్ణమోహన్‌ సోదరులకు చెందిన మండువా ఇంట్లో తీశారు. షూటింగ్‌ విరామ సమయంలో స్థానికులతో చంద్రమోహన్‌ సరదాగా గడిపేవారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని కొత్తపేట కళాసాహితి కోశాధికారి షేక్‌ గౌస్‌ విచారం వ్యక్తం చేశారు.

● శ్రీదేవి తొలి చిత్రం పదహారేళ్ల వయసులో హీరోగా చంద్రమోహన్‌ నటించారు. ఈ సినిమా షూటింగ్‌ 1978లో రామచంద్రపురం పరిసర గ్రామాలతో పాటు కోటిపల్లి, కోట, గోదావరి తీర ప్రాంతాల్లో ఎక్కువ రోజులు జరిగింది. ఆ సమయంలో చంద్రమోహన్‌ రామచంద్రపురంలో ఉంటూ షూటింగ్‌లో పాల్గొనే వారు. పదహారేళ్ల సినిమా షూటింగ్‌ అనంతరం ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన సత్కార సభలో చంద్రమోహన్‌, శ్రీదేవి పాల్గొన్నారు.

● రామచంద్రపురం రాజుగారి కోటలో తీసిన పలు సినిమాల్లో చంద్రమోహన్‌ నటించారు.

7వ పేజీ తరువాయి

Read latest Kakinada News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top