కొనుగోళ్లకు సన్నద్ధం | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లకు సన్నద్ధం

Published Mon, Mar 25 2024 1:05 AM

- - Sakshi

గత వానాకాలంలో నెరవేరని లక్ష్యం..

గత వానాకాలంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువ శాతం రైతులు ప్రైవేటు వైపే మొగ్గు చూపడంతో కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో సన్నరకాలపై రైతులు ఆసక్తి చూపడం.. సన్నరకాలకు ప్రభుత్వం ఇచ్చే ధర గిట్టుబాటు కాకపోవడంతో ప్రైవేటులోనే ధాన్యాన్ని విక్రయించారు. ధాన్యం సేకరణకు మొత్తం 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా.. కేవలం లక్ష మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. ఇదిలా ఉంటే, కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. తేమ పేరుతో ధరలు తగ్గించడం.. ఇతరత్రా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వినిపించాయి. ఈ యాసంగిలో ఐకేపీ ద్వారా 178, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 20, మెప్మా ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

యాసంగి వరిధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు

నాగర్‌కర్నూల్‌: యాసంగి వరిధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పంట దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మరో 10 – 20 రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్నందున.. ఏప్రిల్‌ మూడో వారం నుంచి కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 202 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈమేరకు ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతులకు ఇబ్బందులు

కలగకుండా చూస్తాం..

రైతుల నుంచి ధాన్యం సేకరణకు 202 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదనలు సిద్ధంచేశాం. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఏప్రిల్‌ మూడో వారంలో కానుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. – స్వామికుమార్‌, డీఎస్‌ఓ

గణనీయంగా

పెరిగిన వరిసాగు..

జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరిగింది. ఈ యాసంగిలో 1,55,553 ఎకరాల్లో వరిసాగు చేయగా.. 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గ్రేడు–ఏ రకం ధాన్యాన్ని రూ.2,203, రెండో రకాన్ని రూ.2,183 ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ధరను నిర్ణయిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంక్‌ అకౌంట్‌, వీఆర్‌ఓ, ఏఈఓతో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

జిల్లాలో 202 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

ఏప్రిల్‌ మూడో వారంలో కొనుగోళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement