12 కార్డుల్లో ఏదో ఒకటి.. | Sakshi
Sakshi News home page

12 కార్డుల్లో ఏదో ఒకటి..

Published Thu, Nov 30 2023 12:56 AM

-

పోల్‌ చిట్టీల పంపిణీ జరగకపోయినా నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయొచ్చు. బీఎల్‌ఓలు పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. అక్కడ బీఎల్‌ఓలను కలిసి పోల్‌ చిట్టీలు తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటరుకార్డు లేకపోతే.. పాస్‌పోర్టు, డైవింగ్‌ లైసెన్స్‌, ఫొటోతో ఉన్న సర్వీస్‌ గుర్తింపుకార్డు, బ్యాంకు, పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌, పాన్‌కార్డు, ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఫొటోతో కూడిన పెన్షన్‌ కార్డు, ఆధార్‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, ఎన్‌ఆర్‌ఐలు అయితే పాస్‌పోర్టు చూపించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement