వసతుల లేమి | Sakshi
Sakshi News home page

వసతుల లేమి

Published Sat, Apr 20 2024 1:55 AM

మామిడి మార్కెట్‌లో కాయలను గ్రేడింగ్‌ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ కూలీలు
 - Sakshi

మామిడి మార్కెట్‌తో ఉపాధి

వలస

కూలీ..

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల మండలం చల్‌గల్‌ మామిడి మార్కెట్‌ కూలీలకు ఉపాధి మార్గంగా మారింది. మామిడి సీజన్‌లో ఇక్కడ పని చేసేందుకు స్థానిక కూలీలే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌ నుంచి వస్తుంటారు. అయితే, వేల సంఖ్యలో కూలీలు వస్తుండగా.. వారితో పని చేయించుకునే వ్యాపారులు, మార్కెటింగ్‌ శాఖ వారు పట్టించుకోకపోవడంతో కూలీలకు కనీస వసతులు కరువయ్యాయి.

వేల సంఖ్యలో కూలీలు

మామిడి సీజన్‌ ఏప్రిల్‌, మే నెలల్లో కొనసాగుతుంటుంది. ఈ సీజన్‌లో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో రోడ్ల వెంట వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని, రైతుల నుంచి మామిడికాయలు కొనుగోలు చేస్తుంటారు. కొనుగోలు చేసిన వాటిని ట్రాక్టర్‌ నుంచి దింపి, గ్రేడింగ్‌తో పాటు అట్ట పెట్టెల్లో ప్యాకింగ్‌ చేసి లారీల్లో లోడ్‌ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో కూలీలు అవసరమవుతారు. దీనికి తో డు, తోటల్లో కాయలు తెంపేందుకు సైతం కూలీల అవసరం ఎక్కువ. అయితే, ఈ పనులు చేసేందుకు స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల వారిని రప్పిస్తుంటారు. ఒక్కో వ్యాపారి దుకాణంలో 50 మంది వరకు పనిచేస్తుంటారు.

నెల రోజుల్లో..

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలను మామిడికాయలు తెంపేందుకు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసేందుకు వ్యాపారులు ఉపయోగించుకుంటారు. అలాగే, ఢిల్లీ, రాజస్తాన్‌ నుంచి వచ్చినవారిని మామిడిని గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసేందుకు వినియోగించుకుంటారు. కూలీలు గ్రూపుగా ఏర్పడి ఒక్క టన్ను అన్‌లోడ్‌ చేస్తే రూ.250 వరకు చెల్లిస్తారు. అలాగే, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసే వారికి ట్రేకు రూ.15, ప్యాకింగ్‌ చేసిన పెట్టెలను లారీల్లో లోడ్‌ చేస్తే రూ.3 వేల నుంచి రూ.5 వేలు, కాయలు తెంపడానికి వెళ్తే రూ.500 చెల్లిస్తారు. ఒక వ్యాపారి దుకాణానికి వచ్చిన కాయలను బట్టి ఒక్కో కూలీ కనీసం 30–40 రోజుల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదిస్తారు. ఆయా రాష్ట్రాల్లో వేసవి సీజన్‌లో పనులు లేకపోవడంతో మామిడి మార్కెట్‌లో పనుల కోసం ఇక్కడికి వస్తుంటారు. జిల్లాకు కనీసం 5 వేల నుంచి 6 వేల మంది కూలీలు రాగా, ఒక్క జగిత్యాల మామిడి మార్కెట్లోనే కనీసం 3 వేల నుంచి 4 వేల మంది ఉంటారు.

పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మంది కూలీల రాక

సౌకర్యాల కల్పనలో వ్యాపారుల నిర్లక్ష్యం

వసతులు అంతంతే..

మామిడి మార్కెట్లో కూలీల చేత పనులు చేయించేందుకు చూపుతున్న శ్రద్ధ, వారికి కనీస వసతులు కల్పించడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అసలే మండే వేసవిలో మార్కెట్‌ పక్కనున్న వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్‌ కవర్లతో గుడారాలు వేసుకుని ఉండటం, షెడ్ల కింద పడుకోవడంతో పాటు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనున్న చెట్ల కింద సేద తీరుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

1/1

Advertisement
Advertisement