‘టెట్‌’ మినహాయింపు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

‘టెట్‌’ మినహాయింపు ఇవ్వాలి

Published Mon, Apr 8 2024 1:20 AM

డీఈవోకు పండ్లు అందిస్తున్న నాయకులు - Sakshi

జగిత్యాల: 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు శ్రీటెట్‌శ్రీ నుంచి మినహాయింపు ఇవ్వాలని అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ మహాసంఘ్‌ సహ సంఘటనమంత్రి గుంతుక లక్ష్మణ్‌కు టీపీయూఎస్‌ నాయకులు వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచాలన్నారు. కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్‌, కార్యదర్శి వెంకటరమణారావు ఉన్నారు.

జంక్‌ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు

జగిత్యాలజోన్‌: జంక్‌ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ప్రతిఒక్కరూ పోషకాహారం తీసుకోవాలని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ బయోసైన్స్‌ ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోషకాలతో కూడిన వివిధరకాల పండ్లను ప్రదర్శనగా పెట్టారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ పని ఒత్తిడి, కలుషిత ఆహారం, జంక్‌ఫుడ్‌తో అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఆరోగ్య అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమలలో బయోసైన్స్‌ ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు వీరబత్తిని రాజగోపాల్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతి, మచ్చ శంకర్‌, ప్రశాంతి, రాజేందర్‌, రాజన్న, నర్సయ్య, వసంత పాల్గొన్నారు.

ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై ఈనెల 9న ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. అనంతరం వేదాలు, శాస్త్రాల్లో వివిధ కళల్లో నిష్ఠాతులకు ఆలయం తరఫున ఉగాది పురస్కారాలు, సన్మానాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది.

కొండగట్టులో కోరుట్ల జడ్జి పూజలు

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్నను ఆదివారం కోరుట్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.పావని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు జడ్జి కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదం అందించారు.

వినతిపత్రం అందిస్తున్న నాయకులు
1/1

వినతిపత్రం అందిస్తున్న నాయకులు

Advertisement
Advertisement