ఎక్సైజ్‌ పోలీసుల దాడులు | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ పోలీసుల దాడులు

Published Thu, Nov 9 2023 12:18 AM

 పట్టుకున్న మద్యం, నిందితులతో ఎకై ్సజ్‌ సీఐ, సిబ్బంది
 - Sakshi

జగిత్యాలక్రైం: మద్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని జగిత్యాల ఎకై ్సజ్‌ సీఐ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. బుధవారం రాయికల్‌ మండలంలోని ఒడ్డెలింగాపూర్‌ వైపు వెళ్తున్న మంక్త్యానాయక్‌ తండాకు చెందిన ఇద్దరు నాటుసారా తయారీకి వాడే బెల్లం పానకాన్ని ద్విచక్రవాహనాలపై తరలిస్తుండగా పట్టుకున్నారు. వారినుంచి 80 కిలోల బెల్లం స్వాధీనం చేసుకోవడంతోపాటు ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. కొత్తపేట వడ్డెరకాలనీకి చెందిన సూర రాజనర్సయ్య ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 11.04 లీటర్ల మద్యంతో పాటు, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. మంక్త్యానాయక్‌ తండా శివారులోని అటవీ ప్రాంతాల్లో 200 లీటర్ల బెల్లం పానకం, ఉప్పుమడుగు గ్రామ శివారులో వెయ్యి లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు. మద్యం రవాణాతోపాటు గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించినా చర్యలు తప్పవన్నారు. దాడుల్లో ఎస్సై మేఘమాల, సరిత, రవి ఉన్నారు.

మద్యం పట్టివేత

రామగుండం: అక్రమంగా ఆటోలో తరలిస్తున్న మద్యాన్ని బుధవారం ఎకై ్సజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మల్యాలపల్లికి చెందిన సతీశ్‌ రామగుండంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.8వేలు విలువగల మద్యం కొనుగోలు చేసి ఇంటికి తరలిస్తుండగా ఎకై ్సజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్‌ చేసి సతీశ్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ సుంకరి రమేశ్‌ తెలిపారు. ఇక్కడ ఎస్సై శారద, సిబ్బంది ఖదీర్‌, ప్రసాద్‌, రాజ్‌కుమార్‌ తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement