Woman Made the Record for the Longest Beard - Sakshi
Sakshi News home page

అందమైన గడ్డం ఆమెకే సొంతం.. మరో గడ్డం బామ్మతో తలపడి..

Aug 13 2023 11:06 AM | Updated on Aug 13 2023 12:01 PM

Woman Made the Record for the Longest Beard - Sakshi

ప్రపంచంలో విచిత్రమైన రికార్డులు నెలకొల్పేవారు చాలామందే ఉన్నారు. అయితే ఒక మహిళ తన పొడవైన గడ్డంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిందనే విషయం మీకు తెలుసా? వినేందుకు ఇది వింతగా అనిపించినా ఇది ముమ్మాటికీ వాస్తవం. అమెరికాకు చెందిన ఎరిన్‌ హనీకట్‌ గత రెండేళ్లుగా తన గడ్డాన్ని పెంచుతూ వస్తోంది. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. 

ఎరిన్‌ పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌(పీసీఓఎస్‌) బాధితురాలు. దీని బారినపడిన వారికి హార్మోనల్‌ బ్యాలెన్స్‌ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా శరీరంపై అత్యధికంగా రోమాలు ఏర్పడతాయి. ఎరిన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమయ్యింది. మొదట్లో ఆమె వివిధ పద్దతుల్లో వాటిని తొలగించేది. మరోవైపు హైబ్లడ్‌ ప్రజర్‌ కారణంగా ఆమెకు చూపు మందగించింది. అప్పటి నుంచి ఆమె ముఖంపై వెంట్రుకలను పెంచసాగింది.

ఎరిన్‌ హనీకట్‌ గడ్డం 30 సెంటీమీటర్ల పొడవు అంటే 11.81 ఇంచీలు పెరిగింది. ఒక మహిళకు ఇంత పొడవాటి గడ్డం ఉండటం విశేషం. ఫలితంగా ఆమె గిన్నిస్‌ రికార్డులలోకి ఎక్కింది. ఈమె కన్నా ముందు అమెరికాకు చెందిన 75 ఏళ్ల మహిళ వివియన్‌ హీలర్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమెకు 25.5 సెంటీమీటర్ల గడ్డం ఉంది. తాను సాధించిన రికార్డు గురించి ఎరిన్‌ మాట్లాడుతూ తాను గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంటానని ఎన్నడూ అనుకోలేదని అన్నారు.
ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement