Man Vaccinated 10 Times In One Day, In New Zealand, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

అదేం కక్కుర్తిరా నీకు!... ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకుంటావా!

Dec 13 2021 1:35 PM | Updated on Dec 13 2021 2:25 PM

New Zealand Man Receive10 Covid19 Vaccine Shots In 24 Hours - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Man Vaccinated 10 Times In One Day: ఒక్క కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నాకే నాకు బాగోలేదని కొందరూ... బాబోయ్‌! మేము వ్యాక్సిన్‌ వేయించుకోమంటూ ఇప్పటికీ భయపడుతున్నవాళ్లు ఉన్నారు. అయితే న్యూజిలాండ్‌కి చెందిన ఈ మహానుభావుడు మాత్రం ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకన్నాడు.

(చదవండి: ఎల్లప్పుడూ ఇలానే ఉండనివ్వండి!.... సోదరీమణులతో దిగిన ఫోటోలను పోస్ట్‌ చేసిన కత్రినా!)

అసలు విషయంలోకెళ్లితే...న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 వ్యాక్సిన్‌లు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇది నిజమా కాదా అన్న ఉద్దేశంతో న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. అయితే సదరు వ్యక్తి వేర్వేరు వ్యక్తుల గర్తింపు కార్డులతో వ్యాక్సిన్‌ మరీ వేయించుకున్నాడని విచారణలో తెలుస్తుంది.

దీంతో ఆరోగ్య మంత్రిత్వశాఖకు సంబంధించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ మేనేజర్‌ ఆస్ట్రిడ్ కూర్నీఫ్ ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళనకు గురై సదరు వ్యక్తిని తక్షణమే వైద్యుడుని సంప్రదించవల్సిందిగా సూచించారు. అయితే హెల్త్‌ రికార్డు ప్రకారం ఎవరి హెల్త్‌ రికార్డు ప్రకారం వారు వేయించకోవాలి. ఇలా మరోకరి గుర్తింపు రికార్డుతో వేయించుకోవడం చాల ప్రమాదం అంటూ న్యూజిలాండ్‌ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెలెన్‌ ప్రజలను హెచ్చరించారు.

(చదవండి: పెళ్లి చేసుకోమని అడిగినందుకు... గొంతు కోసి చంపేశాడు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement