ఫిలిప్పీన్స్‌లో 7.1 తీవ్రతతో భూకంపం | 7 1 Magnitude in Philippines | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో 7.1 తీవ్రతతో భూకంపం

Jul 11 2024 11:06 AM | Updated on Jul 11 2024 11:47 AM

7 1 Magnitude in Philippines

ఫిలిప్పీన్స్‌లో ఈరోజు(గురువారం)బలమైన భూకంపం సంభవించింది. సోక్స్‌సర్జెన్‌కు 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలెబ్స్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపం లోతు 620 కిలోమీటర్లు.

భూకంపం ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపించినప్పటికీ భారీగా నష్టం జరిగినట్లు  ఇప్పటివరకూ వార్తలు లేవు. అలాగే భూకంపం తర్వాత ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఫిలిప్పీన్స్‌లోని మిండానావోలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement