తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్‌ | Hyundai Creta Knight Edition Launched In India | Sakshi
Sakshi News home page

తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్‌

Sep 4 2024 5:43 PM | Updated on Sep 4 2024 7:36 PM

Hyundai Creta Knight Edition Launched In India

హ్యుందాయ్ ఇండియా క్రెటా నైట్ (Creta Knight) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని క్రెటా వేరియంట్‌లకు ఇది కాస్మెటిక్ అప్‌గ్రేడ్. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.14.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 ఎంపీఐ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో పలు వేరియంట్లు ఉన్నాయి.

బ్లాక్‌ కలర్‌ ఎక్స్‌టీరియర్‌, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్‌ రియర్‌ వ్యూ మిర్రర్‌, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్‌డేట్‌లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్‌ పూర్తిగా బ్లాక్ అప్‌హోల్స్‌స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్‌డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్‌ కలర్‌ ఇన్సర్ట్‌లు ఉన్నాయి.

సాధారణ కలర్‌ ఆప్షన్స్‌ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్‌ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.

కొత్త ఎడిషన్‌ ధరలు

  • హ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్

  • CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలు

  • CRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలు

  • CRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలు

  • CRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలు

  • హ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్

  • CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలు

  • CRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలు

  • CRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలు

  • CRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు

Advertisement
 
Advertisement
Advertisement