ఐలోని మల్లన్నకు పెద్దపట్నం | Sakshi
Sakshi News home page

ఐలోని మల్లన్నకు పెద్దపట్నం

Published Mon, Apr 8 2024 12:55 AM

నటరాజ స్వామి మండపం ఎదుట వేసిన పెద్దపట్నం - Sakshi

ఐనవోలు: శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి జరుగుతున్న జాతర చివరి ఆదివా రం మహా పెద్ద పట్నం, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లన్న కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నటరాజస్వామి మండపానికి ఎదురుగా ఒగ్గు పూజారులు మహా పెద్దపట్నం వేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జునుడి ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలతో నటరాజ స్వామి వేదికపైకి తీసుకువచ్చి కల్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. ముఖ్య అర్చకుడు మధుకర్‌ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్‌ వినాయక్‌ జోషి, ఒగ్గు పూజారులు పెద్ద మనుషులు మజ్జిగ మహేందర్‌, మల్లయ్య, వెంకట నారాయణ కార్యక్రమం నిర్వహించగా.. ఈఓ అద్దంకి నాగేశ్వర్‌ రావు పర్యవేక్షించారు.

పెద్దపట్నం వేసిన అనంతరం నృత్యం చేస్తూ 
బండారి(పసుపు) చల్లుకుంటున్న భక్తులు
1/1

పెద్దపట్నం వేసిన అనంతరం నృత్యం చేస్తూ బండారి(పసుపు) చల్లుకుంటున్న భక్తులు

Advertisement
 
Advertisement
 
Advertisement