ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీకృష్ణ | Andhra Pradesh Elections 2024: YSRCP Announced Its 8th List Of MLA And MP Segment In-Charges- Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీకృష్ణ

Published Thu, Feb 29 2024 7:42 PM | Last Updated on Thu, Feb 29 2024 7:42 PM

- - Sakshi

ఎంపీ అభ్యర్థిగా రోశయ్య..
● 8వ జాబితాలో ప్రకటించిన వైఎస్సార్‌ సీపీ ● పండగ వాతావరణంలో పార్టీ శ్రేణులు

పట్నంబజారు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించిన ఎనిమిదో జాబితాలో గుంటూరు జిల్లాకు సంబంధించి రెండు విశేషాలు చోటు చేసుకున్నాయి. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు వెంకట రోశయ్యను గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించగా, అక్కడ ఖాళీయైన పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బజరంగ్‌ ఫౌండేషన్‌ సీఈఓ అంబటి మురళీకృష్ణను ఎంపిక చేశారు. కిలారి రోశయ్య ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి రోశయ్య పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఆయనకు మంచి పట్టు ఉంది. పొన్నూరు ఎమ్మెల్యేతోపాటు, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా రోశయ్య అందించిన సేవలు అందిరికి తెలిసిందే.. ప్రతి గ్రామంలో పార్టీ పటిష్టతకు కృషి చేయడంతోపాటు , ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేందుకు తన వంతు కృషి చేస్తూ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో నిరంతరం శ్రమించారు.

పొన్నూరు నియోజకవర్గంలో

విస్తృత సేవా కార్యక్రమాలతో అంబటి

సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అంబటి మురళీకృష్ణ ఏడాది కాలంపైగా జగన్నామ సంక్షేమ సంగమం పేరిట పొన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి, తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువతకు సంబంధించి నేత్ర వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి కళ్లజోళ్ల పంపిణీ, ‘మీ గుండె పదిలం’ పేరిట హృద్రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, యాంజియోగ్రామ్‌లు చేయించడం, స్టంట్లు వేయించడం, గుండె శస్త్ర చికిత్సలు చేయించడం వంటి సేవా కార్యక్రమాలను ఇతోధికంగా చేపట్టారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ తన ఉనికిని చాటుకున్నారు. సామాన్యులకు సైతం సుపరిచితులయ్యారు. ఏడాదికాలంలో దాదాపు 87 వైద్యశిబిరాలు నిర్వహించి, వేలాదిగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. మరోవైపు దివ్యాంగ దర్శిని పేరిట కాళ్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందజేస్తూ తన సేవానిరతిని చాటుకున్నారు. వెరసి పొన్నూరు నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు విశేష కృషి చేశారు. తన శిబిరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటాలను రోగులకు అందజేయడంతో పాటు, ఇంటింటికి వెళ్లి పార్టీకి విస్తృత ప్రచారం కల్పించారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటు, ఆ పథకాల నుంచి పొందిన స్ఫూర్తితో తాను ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రతి శిబిరంలోనూ ప్రకటిస్తూ వచ్చారు. వైఎస్సార్‌ సీపీ పటిష్టతకు పాటుపడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ఆయన చేస్తున్న సేవలకు పొన్నూరు నియోజకవర్గ ప్రజలు ఫిదా అయ్యారు. పొన్నూరు నియోజకవర్గంలో ఐదు గ్రామాలు మినహా అన్ని గ్రామాలలో ఇప్పటికే జగన్నామ సంక్షేమ సంగమం శిబిరాలను పూర్తి చేసి పేదల ఆరోగ్యానికి తన వంతు చేయూతనందించారు. అంబటి మురళీకృష్ణ స్వగ్రామం పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో పెద్దేటమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి గ్రామంపై తనకున్న బాధ్యతను తెలియజేశారు. అలాగే ముస్లింలు, ఎస్టీలకు కమ్యూనిటీ హాళ్లను నిర్మించి వారి హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. మరోవైపు తన సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల కోసం తన ఔదార్యాన్ని చాటుకుంటూ గుంటూరులో కాపు హాస్టల్‌ నిర్మాణంలో భాగస్వా ములయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement