జగనన్న కాలనీలు చక్కగా ఉన్నాయి | - | Sakshi
Sakshi News home page

జగనన్న కాలనీలు చక్కగా ఉన్నాయి

Published Sat, Nov 18 2023 1:58 AM | Last Updated on Sat, Nov 18 2023 1:58 AM

- - Sakshi

తాడేపల్లిరూరల్‌ : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలోని నివాసాలను శుక్రవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఇప్పటంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పేద ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కేంద్ర హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ రీజినల్‌ కో– ఆర్డినేటర్‌ సునీల్‌ ఫరూక్‌ తన బృందంతో పరిశీలించారు. ఇప్పటంలో మొత్తం 35 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించగా అందులో ఇప్పటికే 28 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. గృహిణులతో సునీల్‌ ఫరూక్‌ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా సొంత ఇల్లు లేనివారికి ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారని, ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్లు చాలా అందంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.1లక్షా 75 వేలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాన్ని ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలైన కరెంటు, రోడ్లు, మంచి నీటి సౌకర్యాలు కల్పిస్తోందని, అదనంగా రూ.30 వేలతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు రూ.12 వేలు, డ్వాక్రా సంఘాల నుంచి మరికొంత నగదు అందజేస్తున్నట్టు తెలిసిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు మనీష్‌, ఏపీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి నాగభూషణం, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టి. వేణుగోపాలరావు, రిటైర్డ్‌ ఎఎస్సీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర బృందం కితాబు ఇప్పటంలో గృహాల సందర్శన లబ్ధిదారులతో వివరాల సేకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement