
‘బొమ్మోలె ఉందిరా పోరీ..’ అంటూ చీర కట్టినా, జీన్స్ వేసినా అచ్చం కుందనపు బొమ్మలాగే ఉంటుంది నటి మేఘా ఆకాశ్. ఇప్పుడు ఆ రెండింటి కలయికలోనూ అద్భుతంగా ట్రెడిషన్ విత్ కాంటెంపరరీ లుక్ ట్రై చేసింది. ఆ ఫ్యాషన్ వివరాలే ఇక్కడ చూద్దాం..
వెండి వెలుగులు
ఆభరణాల విలువల పోటీలో బంగారం తర్వాతి స్థానమే వెండిది అయినా, మగువ అందాన్ని పెంచడంలో మాత్రం ఈ ఆభరణాలు తగ్గేదేలే అంటూ పోటీ పడతాయి. ఎందుకంటే, వెండి ఆభరణాలను ధరిస్తే వచ్చే లుక్కే వేరు. తక్కువ ధరలో లభించడంతో వీటికి అభిమానులు కూడా ఎక్కువే.
సాధారణంగా వెండిని కాళ్ల పట్టీలు, కంకణాలు, మెట్టెలు వంటి ఆభరణాలకే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు వెండిని కూడా మెడలో హారాలు, చెవి పోగులకు, వివిధ ఆభరణాల రూపంలోకి మార్చేస్తున్నారు. అయితే, ధగధగ మెరిసే వెండి వస్తువుల మాదిరి కాకుండా ఈ వెండి ఆభరణాల రంగు కాస్త డల్‌గా ఉన్నా, ఇవి స్టయిలిష్ అండ్ బ్రైట్ లుక్‌ను తెప్పిస్తున్నాయి.
వీటని మెయింటైనెన్స్ కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంట్రాస్ట్ లుక్ కోసం వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి లుక్ కోసమే నటి మేఘా ఆకాశ్ కూడా ఈ సిల్వర్ జ్యూలరీని ఎంచుకున్నారు చూడండి. ఇక్కడ మేఘా జ్యూలరీ.. బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ చౌకర్ ధర: రూ. 5,800
నెక్ పీస్ ధర: రూ. 41,612, ఉంగరం ధర: రూ. 3,399. ఇక మేఘాకి లిప్‌స్టిక్ ఎక్కువ ఇష్టం ఉండదట. అందుకే, తన బ్యాగులో ఎప్పుడూ చాలా రకాల లిప్ బామ్స్ ఉంటాయని చెబుతోంది.
(చదవండి: పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..)