Beauty Tips In Telugu: Turmeric Ice Cubes For Acne And Pimple Free Skin - Sakshi
Sakshi News home page

Beauty Tips: పసుపు ఐస్‌క్యూబ్‌లతో.. మచ్చలు, వైట్‌ హెడ్స్‌, ట్యాన్‌ మాయం!

Jul 25 2022 10:17 AM | Updated on Jul 25 2022 11:24 AM

Beauty Tips: Turmeric Ice Cubes For Acne And Pimple Free Skin - Sakshi

టర్మరిక్‌ క్యూబ్స్‌తో.. మచ్చలేని అందం

టర్మరిక్‌ క్యూబ్స్‌తో.. మచ్చలేని అందం

ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్‌ హెడ్స్‌ వల్ల నీరసంగా వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్‌క్యూబ్‌లతో మంచి పరిష్కారం లభిస్తుంది. 

►టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్‌ పొడి, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒక గిన్నెలో వేసి చక్కగా కలుపుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. 
►ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి.


►ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్‌ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి. 
►ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్‌ హెడ్స్, ట్యాన్‌ పోయి ముఖం ఫ్రెష్‌గా రేడియంట్‌గా కనిపిస్తుంది.
►చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. 
► పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.  

చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..!
Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement