
వేసవిలో చర్మ సంరక్షణ, మేకప్ గురించి కొంత ఆందోళన సహజం. ఎండకు చర్మం కమిలిపోవడం, మేకప్ చెదిరిపోవడం సహజంగా జరుగుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా...
ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే ఎస్‌పిఎఫ్ ఉన్న మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీనివల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది.
బయటకు వెళ్లినప్పుడు పట్టిన చెమటను తుడవడానికి టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. చెమట పట్టిన చోట టిష్యూ పేపర్‌ను అద్దితే, త్వరగా పీల్చుకుంటుంది. దీని వల్ల మేకప్ చెదిరి΄ోకుండా ఉంటుంది.
మేకప్ తొలగించిన తర్వాత చర్మం విశ్రాంతి పొందడానికి హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. జిడ్డు పోవడానికి కీర, దోస రసం, అలొవెరా జెల్ మాస్క్‌లా వాడి, ఐదు నిమిషాల్లో చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మం తాజాగా మారుతుంది.
చెమట వల్ల చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. సబ్బులకు బదులు బాడీ, ఫేస్ వాష్‌లతో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మంపై గల సూక్ష్మ రంధ్రాలు సహజ నూనెలు కోల్పోవు.
ఈ కాలం త్వరగా అలసట వచ్చేస్తుంటుంది. అందుకని, రోజూ పడుకునేముందు కళ్ల కింద అవకాడో లేదా అలొవెరా క్రీమ్ లేదా ఫిష్ ఆయిల్‌తో మృదువుగా వేలి కొనలతో అప్లై చేయాలి. లేదంటే ఐ క్రీమ్ వాడచ్చు.
వారంలో రెండు సార్లు పాదాలను స్క్రబ్ చేసి, ఫుట్ క్రీమ్‌ను ఉపయోగించాలి.
సంతోషి సౌందర్య నిపుణురాలు