గిరిజన సూపర్‌ బజార్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

గిరిజన సూపర్‌ బజార్‌ ప్రారంభం

Published Tue, Apr 23 2024 8:25 AM

బుట్టాయగూడెంలో నూతనంగా ప్రారంభించిన జీసీసీ సూపర్‌ బజార్‌, కాఫీ హౌస్‌   - Sakshi

బుట్టాయగూడెం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని జీసీసీ డీఎం జి.పార్వతీశం చెప్పారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో గిరిజన సూపర్‌ బజార్‌ కాఫీ హౌస్‌ను పార్వతీశం సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసీసీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉందన్నారు. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న తేనెకు ఎంతో డిమాండ్‌ ఉందన్నారు. అదేవిధంగా జీసీసీ సూపర్‌ బజార్‌లో ముఖ్యంగా జీసీసీ ద్వారా విక్రయిస్తున్న మరొక ఉత్పత్తి అరకు కాఫీకి కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంతో పేరుందని అన్నారు. అరకు కాఫీని పశ్చిమ మన్యం ప్రాంతంలో కూడా అందరికీ అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే బుట్టాయగూడెంలో ప్రత్యేకంగా అరకు కాఫీ షాప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక్కడ కాఫీ తయారు చేసి విక్రయించడమే కాకుండా కాఫీపొడి ప్యాకెట్‌లను కూడా విక్రయిస్తామని చెప్పారు. అలాగే కుంకుడుకాయ ప్యాకెట్‌లు, షాంపూలు, బొబ్బర్లు, అలోవెరా సబ్బులు, త్రిఫల, తదితర వస్తువులను విక్రయిస్తున్నామని అన్నారు. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్‌ సీహెచ్‌ రాజయోగి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement