28న కై కలూరులో సామాజిక బస్సు యాత్ర | Sakshi
Sakshi News home page

28న కై కలూరులో సామాజిక బస్సు యాత్ర

Published Sat, Nov 25 2023 12:26 AM

మహిళకు గ్యాస్‌ స్టౌ, సిలిండర్‌ నమూనా అందిస్తున్న దృశ్యం    
 - Sakshi

కై కలూరు: బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిస్తూ సామాజిక న్యాయం పాటించిన పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్‌ సీపీనే అని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌), ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. స్థానిక సీతారామ ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఈనెల 28న కై కలూరులో జరుగనున్న బస్సు యాత్ర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంటా సంధ్య, రాష్ట్ర వడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ సైదు గాయత్రి సంతోషి, ఎంపీపీలు అడవి వెంకటకృష్ణ మోహన్‌, రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్లు దండే పుష్పలత, అయినాల బ్రహ్మాజీ, జెడ్పీటీసీలు, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమ ఫలాలు గ్రామస్థాయికి చేర్చడమే లక్ష్యం

ద్వారకాతిరుమల: పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫలాలు గ్రామస్థాయి వరకు అందించడమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి పియూష్‌ కుమార్‌ అన్నారు. తిమ్మాపురంలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోషణశక్తి నిర్మాణ అభియాన్‌, ప్రధాన మంత్రి ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌, ఆయూష్మాన్‌ భారత్‌, స్వయం సంఘాల ఉత్పత్తులు, పీఎం సురక్ష భీమాయోజన తదితర స్టాల్స్‌ను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌, జేసీ బి.లావణ్య వేణి, గ్రామ, వార్డు సచివాలయ అడిషినల్‌ డైరెక్టర్‌ భావన వశిష్టలతో క లిసి ఆయన సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పి ంచడం, వాటి నుంచి నూరుశాతం సంతృప్తిని సాధించడమే ధ్యేయమన్నారు. ఎమ్మెల్యే తలారి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. కలెక్టర్‌ ప్ర సన్న వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అ నంతరం ఉజ్వల పథకం కింద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ కనెక్షన్‌, స్టవ్‌లను పీయూష్‌ కుమార్‌ అందించారు. అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ టి.శ్రీపూజ, జెడ్పీ సీఈఓ కేఎస్‌ఎస్‌ సుబ్బారావు, డీపీఓ తూతిక విశ్వనాథ్‌ శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై.రామకృష్ణ, పశుసంవర్ధక శాఖ జేడీ జి.నెహ్రూబాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సత్యనారాయణ, నాబార్డ్‌ డీడీఎం అనిల్‌ కాంత్‌, డీఆర్‌డీఏ పీడీ డాక్టర్‌ ఆర్‌.విజయరాజు, డ్వా మా పీడీ రాము, డీఈఓ శ్యాంసుందర్‌, ఎల్‌డీఎం నీలా ద్రి, తహసీల్దార్‌ పి.సతీష్‌, సర్పంచ్‌ ఎర్రగొల్ల రజని తదితరులున్నారు.

ఏటీఓగా శ్రీవిద్య

ఏలూరు (మెట్రో): ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 సర్వీసు ద్వారా అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌గా జిల్లా ఖజానా కార్యాలయానికి ఎస్‌.విద్యను నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఖజానా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా శాఖ తరఫున అధ్యక్షుడు యూవీ పాండురంగారావు, సెక్రటరీ కప్పల సత్యనారాయణ, ట్రెజరర్‌ నెరుసు గణేశ్వరరావు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పి.ప్రేమావతి, సీనియర్‌ ఉప ఖజానాధికారి గెడ్డం విజయ్‌గణేష్‌ బాబు, ఏపీఎన్‌జీఓ ఉమ్మడి జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ నారాయణనాయుడు, ఖజానా కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే డీఎన్నార్‌, చిత్రంలో ఎమ్మెల్సీ జయమంగళ
1/2

మాట్లాడుతున్న ఎమ్మెల్యే డీఎన్నార్‌, చిత్రంలో ఎమ్మెల్సీ జయమంగళ

ఏటీఓకి అభినందనలు తెలుపుతున్న ఉద్యోగులు
2/2

ఏటీఓకి అభినందనలు తెలుపుతున్న ఉద్యోగులు

Advertisement
Advertisement