రాజ్యాంగాన్ని గౌరవించాలి | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని గౌరవించాలి

Published Mon, Nov 20 2023 1:44 AM

- - Sakshi

భీమడోలు: బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపై ఉందని ఎస్సీ కమీషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. భీమడోలు ఆర్‌అండ్‌ బీ ప్రాంగణంలో ఆదివారం రాత్రి దళితుల ఆత్మీయ సమావేశం జరిగింది. తొలుత ఆయనకు దళితుల నాయకులు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఆర్జావారిగూడెలలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జై భీమ్‌ అంటూ నినదించారు. ఎంపీడీవో సీహెచ్‌ పద్మావతిదేవి, తహసిల్దార్‌ ఎం.ఇందిరాగాంధీతో కలిసి ఆర్డీవో ఎన్‌ఎస్‌కే ఖాజావలి మర్యాదపూర్వకంగా కలిసి పుచ్చగుచ్ఛాన్ని అందించారు. అనంతరం ఆత్మీయ సమావేశానికి ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మెండెం సంతోష్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని దళితుల సమస్యలు, రిజర్వేషన్లు, ప్రభుత్వం నుంచి దళితులకు వచ్చే రాయితీలు, దళిత ఉద్యోగుల పదోన్నతులు, విద్యార్థుల సమస్యలపై చర్చించారు. విక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ దళితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐ బీబీ రవికుమార్‌, నారాయణపురం డిగ్రీ కళాశాల అధ్యాపకుడు కొండా రవి, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు కొత్తపల్లి చంద్రమౌళి, జిల్లా నాయకులు కనికెళ్లి మురళీకృష్ణ, నిర్వాహకులు దౌలూరి మరియన్న, గోగులమూడి రవికుమార్‌, ఎం.రత్నంరాజు, ఉండ్రు బెంజిమన్‌, కె.జాన్‌ప్రసాద్‌, చెక్కా పుల్లయ్య, నాయకులు గొల్లా కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement