10వ తరగతి ఫలితాలలో తిరుమల విజయభేరి | Sakshi
Sakshi News home page

10వ తరగతి ఫలితాలలో తిరుమల విజయభేరి

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. కె.రఘువీర్‌ 595 మార్కులు, కె.సుప్రియ 595 మార్కులు, ఏపీఆర్‌ సాయిశ్రీలత, బి.లలితరాణి, కె.సత్యభాస్కర్‌ 594 మార్కులు, టి.ప్రీతిశరణ్య, ఎం.ఇబ్రహీం 593మార్కులు, కె.అశ్రిత, ఎంవీఎల్‌ఎ వాత్సల్య, ఎం.గ్రీషశ్రీ, బియు.ప్రసాద్‌, పి.శ్రీతుల్య, జేవీఎన్‌ సత్యసాయిదత్త, వై.తేజశ్వి, ఎస్‌.రంజిత్‌కుమార్‌ 592మార్కులు, వై.కృష్ణచైతన్య, ఎల్‌.వైష్ణవి, సీహెచ్‌.లోక్‌ప్రకాష్‌, ఎస్‌వీఎస్‌.శ్రీధర్‌, డి.చిన్మయి 591మార్కులు సాధించారన్నారు. 590పైన 34మంది విద్యార్థులు, 580పైన 223 మంది విద్యార్తులు, 570పైన 451మంది, 560పైన 642 మంది, 550పైన 779మంది, 500పైన 451మంది , 560పైన 642మంది, 550పైన 779మంది, 500పైన 1108 మంది విద్యార్థులు సాధించారని, 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్‌ సరోజినిదేవి, అకడమిక్‌ డైరెక్టర్‌ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్‌ వి.శ్రీహరి అభినందించారు.

Advertisement
Advertisement