ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్‌ | Tdp Leader Arrested For False Propaganda On Acb Judge Himabindu | Sakshi
Sakshi News home page

ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్‌

Sep 28 2023 12:31 PM | Updated on Sep 28 2023 1:26 PM

Tdp Leader Arrested For False Propaganda On Acb Judge Himabindu - Sakshi

 ఏసీబీ జడ్జి హిమబిందుపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన న్యాయమూర్తిపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచా­రం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్‌ బ్రాంచ్‌కు పోలీసులు అప్పగించారు.

కాగా, చంద్ర­బాబుకు రిమాండ్‌ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్య­కర్తలు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్‌పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement