వివాహేతర సంబంధం: భర్తను హత్యచేసి.. | Police Detained Woman Over Eliminates Husband Nalgonda District | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: తండ్రిని చంపుతుండగా చూసి..

Jan 27 2021 10:55 AM | Updated on Jan 27 2021 11:36 AM

Police Detained Woman Over Eliminates Husband Nalgonda District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తన తండ్రిని చంపుతుండగా కళ్లారా చూసిన ఆ అబ్బాయి విషయాన్ని అందరికీ చెప్పాడు.

సాక్షి, నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో భార్య. అంతేగాక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. ఈ క్రమంలో బంధువులు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ పన్నాగం ఫలించినందుకు నిందితులు ఇద్దరు సంతోషించారు. కానీ నిందితురాలి పెద్ద కొడుకు నోరు విప్పడంతో వీరి బండారం బయపడింది. తన తండ్రిని చంపుతుండగా కళ్లారా చూసిన ఆ అబ్బాయి విషయాన్ని అందరికీ చెప్పాడు.
(చదవండి: నల్గొండలో జంట హత్యల‌ కలకలం)

మునుగోడు మండలం, కొరటికల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న జరిగిన ఈ హత్యకేసుకు సంబంధించిన అసలు నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మనుమడు చెప్పిన వివరాల ఆధారంగా మృతుడి తల్లిదండ్రులు కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement