మలక్‌పేట్‌లో కారు బీభత్సం.. వృద్దుడిపై కేసు | 72 year Old Man Rash Driving Burglary Into Near Tea Shop In Hyderabad | Sakshi
Sakshi News home page

మలక్‌పేట్‌లో కారు బీభత్సం.. వృద్దుడిపై కేసు

Dec 15 2020 3:13 PM | Updated on Dec 15 2020 3:31 PM

72 year Old Man Rash Driving Burglary Into Near Tea Shop In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌ పేట్‌ డీమార్ట్‌ ఎదురుగా కారు బీభత్సం సృష్టించింది. 72 ఏళ్ల వృద్ధుడు హోండా సిటీ కారుతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ సమీపంలోని ఓ టీ కొట్టులోకి దూసుకెళ్లాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో కారు డ్రైవింగ్‌ చేసిన వృద్ధుడు రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement