ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు | Sakshi
Sakshi News home page

ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు

Published Thu, Apr 18 2024 10:40 AM

పులిచెర్లలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - Sakshi

● ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ● సాగు.. తాగునీరు అందిస్తాం ● ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాం ● మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి

పులిచెర్ల(కల్లూరు) : పుంగనూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు పూర్తి చేశామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని 12 పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో గండి కోట నుంచి నీరు తెచ్చి ఇక్కడ మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. వీటి ద్వారా మూడు మండలాలకు సాగు..తాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించి కొళాయిల ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తామని తెలిపారు. ఇలాంటి మంచి పనికి చంద్రబాబు మోకాలడ్డారని, సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తామని, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రారుణాలు మాఫీ చేస్తానని, మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టి ఆడ బిడ్డ పుట్టినప్పుడు వారి ఖాతాలో రూ.35 వేలు జమచేస్తానని మహిళలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ పేరుతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాయమాటలను నమ్మవద్దని సూచించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన ప్రతి హామీ వందశాతం నెరవేర్చారని తిరిగి ముఖ్యమంత్రిగా జగన్‌ను ఎన్నుకుంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఇన్ని పథకాలను ప్రజలకు నేరుగా అందించే ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని, భవిష్యత్‌ కూడా చూడలేమని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు ఎమ్మెల్యేగా తనను, రాజంపేట ఎంపీగా మిథున్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్‌ కుమార్‌, ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌, పార్టీ మండల కన్వీనర్‌ నాధమునిరెడ్డి, జిల్లా ప్రింటింగ్‌ ప్రెస్‌ చైర్మన్‌ మురళీమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు హేమసుందరరెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ ముర్వత్‌బాషా, రెడ్డీశ్వరరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, పోకలచంద్ర, ఆనంద, చెంచురెడ్డి,, నాగరాజ ప్రసాద్‌, రాయల్‌ మోహన్‌, రాణెమ్మ, ప్రభాకర్‌, రాఘవరెడ్డి పాల్గొన్నారు.

నవమి వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి

106 రామిరెడ్డిగారిపల్లె పంచా యతీ చెరువు ముందరపల్లెలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement