Scoot Slash Ticket Fare From Visakhapatnam To Singapore - Sakshi
Sakshi News home page

బంఫరాఫర్‌: వైజాగ్‌ నుంచి సింగపూర్‌ విమాన టికెట్‌ ఎంతో తెలుసా?

May 17 2023 8:58 AM | Updated on May 17 2023 10:11 AM

Scoot Slash Ticket Fare From Vizag To Singapore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ అనుబంధ సంస్థ స్కూట్‌ తమ టికెట్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మే 16 నుంచి 20 వరకు ఈ నెట్‌వర్క్‌ సేల్‌ కొనసాగుతుంది. దీని ప్రకారం ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని 17 దేశాలకు తక్కువ చార్జీలకే విమాన ప్రయాణం చేయొచ్చని సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి: యూట్యూబ్‌ వీడియో లైక్‌ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్‌ చేస్తే!

విశాఖ నుంచి సింగపూర్‌నకు అత్యంత తక్కువగా రూ. 6,200కే (వన్‌ వే, పన్నులు సహా) టికెట్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు వివరించింది. ఆగస్టు 31 వరకు చేసే ప్రయాణాల కోసం ఇవి వర్తిస్తాయని తెలిపింది.   

Advertisement
 
Advertisement
Advertisement