Reliance Jio Launches New Prepaid Plan With Netflix Subscription - Sakshi
Sakshi News home page

ఇదే తొలిసారి.. రిలయన్స్‌ జియో యూజర్లకు బంపరాఫర్‌!

Aug 18 2023 6:32 PM | Updated on Aug 18 2023 6:40 PM

Reliance Jio Launches New Prepaid Plan With Netflix Subscription - Sakshi

యూజర్లకు జియో శుభవార్త చెప్పింది. తొలిసారి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. 

జియో యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా రెండు ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. తొలి రూ.1,099 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ నెలకు రూ. 149 విలువైన నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) ప్లాన్‌ను  అందిస్తుంది. దీంతో పాటు జియో వెల్‌కమ్ ఆఫర్‌తో అపరిమిత 5జీ డేటా, 2జీబీ/రోజు డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌ మాట్లాడవచ్చు. 

రెండో ప్లాన్‌లో 84 వ్యాలిడిటీతో రూ.1,499 చెల్లించవచ్చు.  ప్రీపెయిడ్‌ ప్లాన్ నెలకు రూ. 199 విలువైన నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌తో యూజర్ అపరిమిత 5జీ డేటాను సొంతం చేసుకోవచ్చు.  

ఈ సందర్భంగా జియో ప్లాట్‌ఫారమ్‌ సీఈవో కిరణ్ థామస్ మాట్లాడుతూ.. “వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మా ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ బండిల్‌ను వినియోగదారులకు అందించేందుకు మరో అడుగు ముందుకు వేశాం. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి గ్లోబల్ పార్టనర్‌లతో చేతులు కలపడం సంతోషంగా ఉందని అన్నారు.

చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement