లాంచ్ కు ముందే లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు

OnePlus 9, 9 Pro, 9 R Price in India - Sakshi

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను రేపు (మార్చి 23) విడుదల చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభించటానికి కొద్దీ గంటల ముందు కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్‌కు చెందిన ధరలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ 9 సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. వీటిలో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఉన్నాయి. కొన్ని లక్షణాలు అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ, ధర వివరాలు మాత్రం బయటకి విడుదల కాలేదు. ఇప్పుడు ఒక టిప్ స్టార్ తన ట్విటర్ ఖాతా ద్వారా వన్‌ప్లస్ 9 సిరీస్‌ ఇండియాకు చెందిన ధర వివరాలను బయటకి లీక్ చేసాడు. లీకైన వివరాల ప్రకారం కంపెనీ వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు (అంచనా):

  • వన్‌ప్లస్ 9 ఆర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.39,999 
  • వన్‌ప్లస్ 9 ఆర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999 
  • వనిల్లా వన్‌ప్లస్ 9 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 
  • వనిల్లా వన్‌ప్లస్ 9 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999
  • వన్‌ప్లస్ 9 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999  
  • వన్‌ప్లస్ 9 ప్రో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999

చదవండి:

కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి తీపికబురు

లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top