ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..! | One-Off Tata Punch Kaziranga Edition To Be Auctioned At IPL Mega Auction 2022 | Sakshi
Sakshi News home page

IPL Mega Auction 2022: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..!

Feb 13 2022 2:13 PM | Updated on Feb 13 2022 4:19 PM

One-Off Tata Punch Kaziranga Edition To Be Auctioned At IPL Mega Auction 2022 - Sakshi

బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ మెగా వేలం-2022 మొదలైన విషయం తెలిసిందే. స్టార్‌ ప్లేయర్స్‌ను దక్కించుకునేందుకు పలు ప్రాంచైజీస్‌ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాగా ఈ ఐపీఎల్‌-2022 వేలంలో ప్లేయర్స్‌తో పాటుగా టాటా మోటర్స్‌కు చెందిన కారు కూడా ఆక్షన్‌లోకి రానుంది. బహుశా ఐపీఎల్‌ వేలంలో ప్లేయర్స్‌నే కాకుండా కారును కూడా వేలం వేయడం ఇదే తొలిసారి. 

వేలంలోకి టాటా పంచ్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌..!
ఐపీఎల్‌-2022 సీజన్‌కు టాటా సంస్థ స్పాన్సర్‌గా వ్యవహారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వేలంలో టాటా మోటార్స్‌కు చెందిన సరికొత్త 'పంచ్‌ కజిరంగా ఎడిషన్‌' కారును కంపెనీ వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కోసం ఖర్చు పెట్టనున్నారు. పంచ్‌ కజిరంగా ఎడిషన్‌ కారు పలు ప్రత్యేమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ ఫీచర్స్‌కు సంబంధించి ఎలాంటి విషయాలను టాటా మోటార్స్‌ ఇంకా వెల్లడించలేదు. ఈ కారును కేవలం ఫ్యాన్స్‌ కోసం మాత్రమే వేలం వేస్తున్నట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. వేలంలో గెలిచిన వారు కజిరంగా టాటా పంచ్‌ స్ఫెషల్‌ ఎడిషన్‌ ఎస్‌యూవీ కారును సొంతం చేసుకుంటారని టాటా మోటార్స్‌ ప్రకటించింది.

భారీ ఆదరణతో టాటా పంచ్‌..!
గత ఏడాది లాంచ్‌ చేసిన టాటా పంచ్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లలో అత్యంత ఆదరణ లభిస్తోంది.  టాటా మోటార్స్‌లో కూడా ఎక్కువగా సేల్‌ అవుతోన్న మోడల్‌గా టాటా పంచ్‌ నిలుస్తోంది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి నెలవారీ విక్రయాలు 40వేలను దాటడంలో ఈ ఎస్‌యూవీ పాత్ర కీలకంగా ఉంది. 

ఫీచర్స్‌లో భేష్‌..!
టాటా మోటార్స్‌ ప్రవేశపెట్టిన టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ ఫీచర్స్‌లో అదిరిపోయింది. ఆటోమేటిక్‌ హెడ్‌లైట్స్‌ ఏడు అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, క్రైమెట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ఏబీఎస్‌, ఈబీడీ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు అత్యంత సురక్షితమైన రేటింగ్‌ను కూడా కల్గి ఉంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ సెటప్‌తో, 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 83బీహెచ్‌పీ వద్ద 113ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. టాటా పంచ్‌  ప్రారంభ ధర రూ.5.65 లక్షల నుంచి అత్యధికంగా రూ.9.29 లక్షల వరకు ఉంది.(ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్‌ ధర)

చదవండి: అత్యంత తక్కువ ధరకే ఎస్​యూవీ కార్..! ఎగబడి కొంటున్న టాటా మోటార్స్ ఎస్​యూవీ కార్లు ఇవే..

Advertisement
 
Advertisement
Advertisement