మెరుగవుతున్న వ్యాపార కార్యకలాపాలు: నోమురా | Nomura Reports That Business Revived In India | Sakshi
Sakshi News home page

మెరుగవుతున్న వ్యాపార కార్యకలాపాలు: నోమురా

Nov 23 2021 9:13 AM | Updated on Nov 23 2021 9:18 AM

Nomura Reports That Business Revived In India - Sakshi

ముంబై: వ్యాపార కార్యకలాపాలు క్రమంగా మెరుగవుతున్నాయి. మహమ్మారికి ముందుతో పోలిస్తే గత వారం 14 శాతం పాయింట్ల అధిక స్థాయికి చేరుకున్నాయని నోమురా ఇండియా వ్యాపార పునఃప్రారంభ సూచిక నివేదిక వెల్లడించింది. ఆదివారంతో ముగిసిన వారంలో సూచిక 114 పాయింట్లు నమోదైందని, అంత క్రితం వారం ఇది 110.3 పాయింట్లుగా ఉందని వివరించింది. గూగుల్‌ వర్క్‌ప్లేస్‌ మొబిలిటీ 18.1 శాతం పాయింట్లు పెరిగితే, రిటైల్, వినోదం 3.3 శాతం పాయింట్లు పడిపోయింది. ఇంధన సంక్షోభం సడలుతోందని, మరోవైపు వాహన రంగంలో సరఫరా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొంది. వృద్ధి అంచనాలు అస్పష్టంగా ఉన్నాయని నోమురా వెల్లడించింది.    
 

Advertisement
 
Advertisement
Advertisement