Adani Group's NDTV To Launch 9 New Channels - Sakshi
Sakshi News home page

9 భాషల్లో ఎన్‌డీటీవీ న్యూస్‌ ఛానల్స్‌

May 19 2023 10:32 AM | Updated on May 19 2023 10:55 AM

Ndtv To Launch 9 New Channels - Sakshi

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో భాగమైన మీడియా దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) తొమ్మి ది భారతీయ భాషల్లో న్యూస్‌ ఛానల్స్‌ను మొదలుపెట్టే యోచనలో ఉంది. దశలవారీగా వీటిని ప్రారంభించనున్నట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు సంస్థ తెలియజేసింది. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలన్న ప్రతిపాదనకు గురువారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. 

అనుమతులు వచ్చాక చానళ్ల ప్రారంభ తేదీలను స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్, రాధికా రాయ్‌ల వాటాలను కూడా కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్‌ గతేడాది డిసెంబర్‌లో కంపెనీని పూర్తిగా దక్కించుకుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్‌డీటీవీ రూ. 221 కోట్ల ఆదాయం నమోదు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement