నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్‌​..! అమ్మకాల ఒత్తిడితో..! | Sakshi
Sakshi News home page

నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్‌​..! అమ్మకాల ఒత్తిడితో..!

Published Fri, Feb 4 2022 10:29 AM

Market LIVE Updates Indices Trade Flat Amid Volatility Metals Shine - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాలను మూటకట్టుకోగా శుక్రవారం ప్రారంభమైన మార్కెట్స్‌ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటిలో పుంజుకొని స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలను జరపడంతో సూచీలు మళ్లీ​ నష్టాలోకి వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీల ఊగిసలాటకు కారణమయ్యాయి. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 

బీఎస్సీ సెన్సెక్స్‌ గురవారం 58,788.02 క్లోజ్‌ అవ్వగా నేడు ఉదయం 10.00 గంటల సమయంలో  58,937. 46 పాయింట్లకు చేరుకోగా కొద్ది సమయంలోనే ఉదయం 10. 20 గంటల సమయంలో దాదాపు 168.31 పాయింట్లు నష్టపోయి 58,610 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ కూడా ఉదయం 10. 22 సమయంలో 34 పాయింట్లు నష్టపోయి 17, 531.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

సెన్సెక్స్‌ సూచీలో టాటాస్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్భాటక్‌ సిమెంట్స్‌, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టైటన్‌, ఐటీసీ, హెైచ్‌యూఎల్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, మారుతీ, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

చదవండి: వరుస లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Advertisement
Advertisement