నుదుటిపై క్యూఆర్ కోడ్ టాటూ.. ఎందుకో తెలిస్తే షాకవుతారు! | Man Gets QR Code Tattoo On Forehead Video Viral | Sakshi
Sakshi News home page

నుదుటిపై క్యూఆర్ కోడ్ టాటూ.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Mar 2 2024 8:24 PM | Updated on Mar 2 2024 8:53 PM

Man Gets QR Code Tattoo On Forehead Video Viral - Sakshi

నుదుటిపై క్యూఆర్ కోడ్ టాటూ..

ఫ్యాషన్ పేరుతో టాటూలు వేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో కూడా పాత పద్ధతులకు గుడ్ బై చెబుతూ.. కొత్త టాటూలకు వేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్‌ను టాటూ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నిజానికి నుదుటిన టాటూ వేయించుకున్న వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ క్యూఆర్ కోడ్‌ను టాటూగా వేయించుకున్నారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అతని ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఓపెన్ అయింది. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఫాలో అవ్వండి అని బంధువులను, స్నేహితులను అడగటం కంటే ఇదే మంచి ఆలోచన అంటున్నారు, మరి కొందరు అతని ఇన్‌స్టాగ్రామ్‌ పిచ్చి పట్టిందని ఇలా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement