టెక్‌ దిగ్గజంలో తొలగింపులు | Intel to slash factory jobs in new round of layoffs starting July | Sakshi
Sakshi News home page

టెక్‌ దిగ్గజంలో తొలగింపులు

Jun 15 2025 4:13 PM | Updated on Jun 15 2025 4:52 PM

Intel to slash factory jobs in new round of layoffs starting July

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ ఫ్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసింది. వచ్చే జూలై మధ్యలో తొలగింపుల ప్రక్రియ ప్రారంభమై నెలాకరు కల్లా పూర్తికానుంది. కొత్త సీఈవో లిప్ బు టాన్ వచ్చాక ఇది తొలి, భారీ ఉద్యోగాల కోత కానుంది.

ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ఇంటెల్‌ నేరుగా ప్రకటించనప్పటికీ ఈమేరకు కంపెనీ ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెమోల ద్వారా తెలియజేసినట్లు పలు అంతర్జాతీయ వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. కంపెనీ తన అంతర్గత తయారీ విభాగమైన ఇంటెల్ ఫౌండ్రీలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుని, మరింత చురుకైన సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగానే ఉద్యోగ కోతలు చేపడుతోందని పేర్కొన్నాయి.

కంపెనీ చేపడుతున్న ప్రస్తుత తొలగింపుల్లో ఎంత మందిపై ప్రభావం పడుతుందనే విషయం వెల్లడికాలేదు. సీనియర్ నాయకత్వం నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే వరకు, తొలగింపులను అమలు చేయడంలో వ్యాపార యూనిట్లకు విచక్షణ ఉంటుందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమ్మకాలు క్షీణించడం, మరోవైపు ఎన్‌విడియా, ఏఎండీ వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ ఫోకస్డ్ హార్డ్ వేర్ లో ఉద్యోగ పునర్నిర్మాణంపై ఇంటెల్‌ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement